తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పలువురు ఆత్మీయులు, స్నేహితులతో కలిసి మియాపూర్‌కు చెందిన రెండు కుటుంబాల నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బౌరంపేటలో జరిగిన లింగమనేని సాంబశివరావు నూతన గృహప్రవేశ వేడుకలో యలమంచి ఉదయ్ కిరణ్, వంశీ, తులసి, గురువులు, మోహన్, శశి లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలుసుకుని, నూతన గృహంలో వారి జీవితం ఆనందం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం సుసంపన్నతతో నిండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా, కృషి నగర్లో జరిగిన మియాపూర్ ఎం.ఏ. నగర్ వాసి బండి రామకృష్ణ నూతన గృహప్రవేశ వేడుకలో కూడా యలమంచి ఉదయ్ కిరణ్, కుమార్ స్వామి , వంశీ, గురువులు, మోహన్, శశి లతో కలిసి పాల్గొన్నారు. రామకృష్ణ కుటుంబ సభ్యులను కలిసి నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కుటుంబంలో శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం , అభివృద్ధి ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ పచ్చదనం, అభివృద్ధి, సుసంపన్నతకు ప్రతీకగా మొక్కలను బహూకరించి, పర్యావరణ పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. నూతన గృహాలు సుఖశాంతులకు నిలయాలుగా, ఆనందానికి చిరునామాలుగా, కుటుంబ అభివృద్ధి, సుసంపన్నతకు వేదికలుగా నిలవాలని యలమంచి ఉదయ్ కిరణ్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. లింగమనేని సాంబశివరావు, బండి రామకృష్ణ , వారి కుటుంబ సభ్యులకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు.
