తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఉస్మానియా విద్యార్థుల ఆహ్వానం మేరకు నిర్వహించిన ఉట్టి కార్యక్రమంలో రాష్ట్ర యాదవ మరియు కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా పూర్వ విద్యార్థులు కుమార్ సాగర్, వెంకట్ రెడ్డి, సాయిచంద్‌తో పాటు ప్రస్తుత విద్యార్థులు రమేష్ యాదవ్, సందీప్ యాదవ్, శ్రీధర్ యాదవ్, శివ యాదవ్, డప్పు గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, తొలిసారిగా ఉస్మానియా యూనివర్సిటీకి రావడం ఎంతో గర్వంగా ఉందని రఘునాథ్ యాదవ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తమ త్యాగాలతో ఎంతో కీలక పాత్ర పోషించారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొంటున్న ప్రతి సోదర సోదరీమణులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
