తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  శ్రీరామ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా శ్రీ సాయి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించి, భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గణేష్ పండుగ వచ్చిందంటే శ్రీరామ కాలనీ మొత్తం పండుగ వాతావరణంతో సందడిగా మారుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు, బస్తీ వాసుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని తెలిపారు. గణపతి ఆశీస్సులతో బస్తీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి బస్తీ వాసులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులతో శ్రీరామ కాలనీ సందడిగా మారింది.