తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :జడ్పీహెచ్‌ఎస్ శివరాంపల్లి పాఠశాలలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జి ఎఫ్ ) ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో టోర్నమెంట్ కం సెలెక్షన్స్ శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ​పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూక్య శీను నాయక్ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి, క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి తోడ్పడతాయని పేర్కొన్నారు.​ఈ పోటీల్లో రాజేంద్రనగర్ మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారు 125 జట్లు, 1200 మందికి పైగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మండల ఇన్చార్జులు బహుమతులను అందజేశారు. హఠాత్తుగా కురిసిన వర్షం కారణంగా శనివారం జరగాల్సిన మిగిలిన జట్ల మ్యాచ్‌లను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మిగతా క్రీడల పోటీలు, ఎంపికలు సోమవారం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాయామ ఇన్చార్జి కె. గాంగ్య నాయక్, వ్యాయామ ఉపాధ్యాయులు బాలస్వామి రెడ్డి, రంగారెడ్డి, జ్యోతి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుదర్శన్, జనార్ధన్ చారి, వెంకటయ్యలతో పాటు ప్రైవేటు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు ప్రకాష్, వెంకట్, తరుణ్, మహేందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.