తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : లక్ష్మీగూడా హౌసింగ్ బోర్డ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కంటికింపుగా, భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. కాలనీ అధ్యక్షులు ఆడికే రాజు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కాలనీవాసులు విశేష సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు మరియు హారతి కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీవాసులకు, భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీ సంక్షేమానికి, ఐక్యతకు ఇలాంటి వేడుకలు ఎంతగానో తోడ్పడతాయని అధ్యక్షులు ఆడికే రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, కాలనీ మహిళలు, యువకులు మరియు పెద్దలు పాల్గొన్నారు.