తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ మండలంలో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్, అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక, ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పద్యాల తోరణం’ విద్యా సంవత్సరం 2026–27 మండల స్థాయి పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. సెప్టెంబర్ 19న నిర్వహించిన పోటీల్లో వివిధ తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు సాధించారు.6వ తరగతి విభాగంలో బుద్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన శివలీల ప్రథమ బహుమతి, మైలార్దేవ్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన షబానా ద్వితీయ బహుమతి సాధించారు. 7వ తరగతిలో పద్మశాలిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వరుణ్ లేనై ప్రథమ బహుమతి, రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన హెమ ద్వితీయ బహుమతి పొందారు. 8వ తరగతిలో మైలార్దేవ్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నిషా ప్రియ ప్రథమ బహుమతి సాధించారు. 9వ తరగతిలో అర్చన ప్రథమ బహుమతి సాధించగా, మైలార్దేవ్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ద్వితీయ బహుమతి సాధించారు. 10వ తరగతిలో మైలార్దేవ్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పవిత్ర ప్రథమ బహుమతి సాధించారు. తెలుగు భాష, పద్య సాహిత్యంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను నిర్వాహకులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మాతృభాషపై మరింత అభిమానం పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
