• ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల భూదోపిడీపై విచారణ జరపాలి: బెజ్జంకి అనిల్
సిద్దిపేట జిల్లా, చిన్నకోడూర్ మండలం: మేడిపల్లి గ్రామ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అక్రమ క్రయవిక్రయాలపై తక్షణమే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపించాలని మేడిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త బెజ్జంకి అనిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజకీయ అండదండలతో దళిత భూముల ఆక్రమణ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 76, 96 మరియు 11 లలో గల దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని చిన్నకోడూరు మాజీ జెడ్పిటిసి ముక్కిస లతా సత్యనారాయణ రెడ్డి, వారి తమ్ముడైన పాపిరెడ్డి (సన్నాఫ్ నర్సింహారెడ్డి) తమ రాజకీయ, ఆర్థిక, అంగబలంతో అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ (బిఆర్ఎస్) పార్టీకి చెందిన వీరు, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి ప్రధాన అనుచరులుగా చలామణి అవుతూ ఈ భూదోపిడీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. గతంలో దళితులకు కేటాయించిన, 22-A (నిషిద్ధ రిజిస్ట్రేషన్ల జాబితా) లో ఉన్న ఈ ప్రభుత్వ భూములను, నాటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి గారి ప్రోత్బలంతో తప్పుడు రికార్డులు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఆక్రమించడమే కాకుండా, ఇతర వ్యక్తులకు అమ్మి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని మండిపడ్డారు.
*RTI ద్వారా బయటపడ్డ ఫేక్ NOC నిజాలు*
సమాచార హక్కు చట్టం (RTI ACT 2005) ద్వారా తాను సేకరించిన అధికారిక సమాచారం ప్రకారం.. ఈ భూములకు సంబంధించి ఎమ్మార్వో (MRO) కానీ, ఆర్డీఓ (RDO) కానీ ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని అధికారులు రాతపూర్వకంగా తెలిపారన్నారు. సదరు భూస్వాముల కుటుంబ సభ్యులకు ఎలాంటి ఎన్ఓసి (NOC – నిరభ్యంతర పత్రం) ఇవ్వలేదని, అసలు దానికి సంబంధించిన ఫైళ్లే కార్యాలయంలో లేవని అధికారులు స్పష్టం చేశారని అనిల్ వెల్లడించారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నాటి కలెక్టర్ జారీ చేసినట్లుగా చెబుతున్న ఆ ‘ఫేక్ ఎన్ఓసి’ వెనుక ఉన్న సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు
నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో భూములను ఆక్రమించిన భూస్వాములు ముక్కిస పాపిరెడ్డి, సత్యనారాయణ రెడ్డిల నుండి ఆ 20 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి.స్వాధీనం చేసుకున్న భూమిని స్థానిక అర్హులైన దళితులకు, భూమి లేని నిరుపేదలకు వెంటనే కేటాయించాలి. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని విక్రయించిన సదరు నాయకులపై, వారికి సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. రాజకీయ బలంతో పేదల భూములను కాజేసిన వారిపై ప్రస్తుత జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని సామాజిక కార్యకర్త బెజ్జంకి అనిల్ హెచ్చరించారు.
