తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : స్థానిక ఆదర్శ కాలనీలో ‘వక్రతుండ అసోసియేషన్’ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగు తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో విశేష భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేపట్టారు. అసోసియేషన్ సభ్యులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, భక్తులు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు.
