తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, తారానగర్ లోని విద్యానికేతన్ మోడల్ హై స్కూల్లో తెలంగాణ స్వాతంత్య్ర యోధుల స్మారక సంఘం పట్టణ ప్రథమ అధ్యక్షులు యం. మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విమోచన పోరాటంలో పాల్గొన్న యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ప్రజల పోరాట స్ఫూర్తిని గుర్తుచేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్, ప్రొఫెసర్ డాక్టర్ ఎ. జయంత్ కుమార్, ఆర్టిస్టు, పరిశోధక విద్యార్థి, తెలంగాణ రాష్ట్ర ఉత్తమ చిత్రకళ అవార్డు గ్రహీత డాక్టర్ గోనె లింగరాజు, ఎన్. రామాచార్యులు, ఎమ్. గాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులు తెలంగాణ విమోచన ఉద్యమ చరిత్ర, సాహిత్యం, కళలు, సామాజిక ఉద్యమాలపై తమ అభిప్రాయాలను, అనుభవాలను తెలియజేసారు. తెలంగాణ విమోచన ఉద్యమ చరిత్రను నేటి తరానికి తెలియజేయడంతో పాటు, ఉద్యమ యోధుల సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రామాచారి, విజయలక్ష్మి, బాలకృష్ణ, చంద్రయ్య, బుచ్చిరెడ్డి, గోవిందరావు, సంజీవరెడ్డి, సంగారెడ్డి, డి. సుధాకర్ చారి, శ్రీనివాస్ రెడ్డి, నాగభూషణం, బి. వెంకట్, రాములు, రామచందర్ , తెలంగాణ ఉద్యమకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సాహితీవేత్తలు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.