తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ డివిజన్, శంషిగూడ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో వినాయక చవితి శుభసందర్భంగా వినాయక కమిటీ సభ్యుల ఆహ్వానంమేరకు పర్యటించి, కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం, వినాయక కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమాన్ని వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా ప్రారంభించి, భక్తులకు అన్న ప్రసాదాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆల్విన్ కాలనీ మరియు శంషిగూడ డివిజన్ ప్రజలందరూ వినాయక చవితి పండుగను కలిసి కట్టుగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వినాయక కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సందర్శించిన మండపాలు,1. ఎన్టీఆర్ నగర్ శ్రీ శిరిడీ సాయిబాబా దేవాలయంలో 2. మాధవి నగర్ కాలనీ 3. ప్రేమ్ సరోవర్ అపార్ట్మెంట్స్ ఆల్విన్ కాలనీ ఫేస్ 1 అసోసియేషన్ మండపం 5ఆల్విన్ కాలనీ ఫేస్ 1 వాటర్ ట్యాంకర్ వద్ద 6. ఈస్ట్ సాయి నగర్ సాయిబాబా దేవాలయం వద్ద 7. వెస్ట్ సాయి నగర్ అసోసియేషన్ మండపం 8. ఆదిత్య నగర్ బాలాజీ అపార్ట్మెంట్స్ 9. శిరిడీ నగర్ అసోసియేషన్ మండపం 10. చక్రధరి నగర్ అసోసియేషన్ మండపం 11. ధరణి నగర్ అసోసియేషన్ మండపం 12. కాకతీయ నగర్ అసోసియేషన్ మండపం,13. వెంకటపాపయ్య నగర్ అసోసియేషన్ మండపం 14. చంద్రమ్మ కాలనీ అసోసియేషన్ మండపం 15. పంచమి కాలనీ అసోసియేషన్ మండపం 16. పాపమ్మ కాలనీ అసోసియేషన్ మండపం 17. పీజేఆర్ నగర్ వరసిద్ధి వినాయక మండపం 18. పీజేఆర్ నగర్ బ్లాక్ వద్ద మండపం 19. పీజేఆర్ నగర్ బ్లాక్ 20, 21 వద్ద మండపం 20. పీజేఆర్ నగర్ గణేష్ నగర్ మండపం 21. ఎన్టీఆర్ నగర్ దర్గా వద్ద మండపం 22. ఎన్టీఆర్ నగర్ మసీదు వద్ద మండపం 23. మారుతి నగర్ అసోసియేషన్ మండపం 24. జయశంకర్ కాలనీ బస్తీ దవాఖాన వద్ద మండపం 25. శ్రీ నగర్ కాలనీ అసోసియేషన్ మండపం 26. ఇందిర హిల్స్ అసోసియేషన్ మండపం 27. ఆస్బెస్టాస్ కాలనీ నాలా వద్ద మండపం.
