తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, గుల్మోహర్ పార్క్ నేతాజీ నగర్ లో వినాయక చవితి పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సుందరమైన మండపంలో
జీవ కాంతులు విరాజిల్లుతున్న గణనాధుని ఏర్పాటుచేసి
నిత్యం వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆ గణనాధుని సన్నిధిలో అన్న ప్రసాదాలు భక్త జనులకు అందజేసి, మహిళల కోలాటాలతో నేతాజీ నగర్ నివాసులు ఆటల పాటలతో గణనాథునికి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేస్తూ అందరూ కలిసి వైభవంగా వేడుకగా గణనాథుడిని నిమజ్జనానికి సాగనంపారు. ప్రత్యేక పూజలతో తమ కోరికలను కోరుకుంటూ వినాయకుని పండుగను సంతోషంగా కలిసిమెలిసి మహిళలు అందరూ కోలాటాలతో బతుకమ్మల ఆటలతో ఆటల పాటలతో పూజించి ఆటపాటలతో ఘనంగా సాగనంపారు.
