తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి, గణేష్ మహారాజ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఎస్‌ఏ కాలనీ, వసంత్ నగర్, కేపీహెచ్‌బీ 5వ ఫేజ్, బాలాజీనగర్ రోడ్ నంబర్-3, కేపీహెచ్‌బీ వన్ సిటీ, కేపీహెచ్‌బీ 4వ ఫేజ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను బండి రమేష్ సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం, ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన *అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమాల్లో కూడా బండి రమేష్ పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ వినాయకుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

You missed