తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్, హుడా కాలనీ శివ పుత్ర యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని సుందరమైన మండపంలో జీవ కాంతులతో విరాజిల్లుతున్న వినాయకుని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం,
20వ తేది ఆదివారం మధ్యాహ్నం గణనాథుని సన్నిధిలో ఏర్పాటుచేసిన అన్నప్రసాదాలను భక్తజనులకు అందజేశారు. ఈ సందర్భంగా భక్తజనులు మాట్లాడుతూ, గణనాధుని దర్శించుకునే అదృష్టాన్ని కల్పించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌసిక్ , కార్తీక్ , కిరీటి , కళ్యాణ్ ,గౌతమ్ మహేష్ , నవీన్, శ్రీనివాస్, ఉదయ్ , సాయి, అబిలాష్ , ఆనంద్ , నాగేందర్ , నవతేజ పాల్గొన్నారు.