తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నల్లగండ్ల లోని వర్టెక్స్ కింగ్ స్టన్ పార్క్ విల్లాస్ క్లబ్ హౌస్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్ పర్సన్ కీ.శే. రాగం సుజాత యాదవ్ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన పెద్దలకు బియ్యం ఇవ్వడం మరియు దేవాలయంలో గంట కట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు శేరిలింగంపల్లి మరియు తదితర ప్రాంతాల నుండి విచ్చేసిన సీనియర్ నాయకులు, పుర ప్రముఖులు, వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ముందుగా అందరూ కీ.శే. రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం, సభా అధ్యక్షులు మాట్లాడుతూ, రాగం వారి ఇంట తీరని విషాదం నెలకొందని, మే9,1996 నుండి 30ఏళ్లకు పైగా రాగం నాగేందర్ యాదవ్ జీవితంలో, ప్రజా సేవలో తోడుగా నిలిచిన రాగం సుజాత యాదవ్ ఇక లేకపోవడం తీరని లోటన్నారు. కౌన్సిలర్ గా 2000-2005 రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ గా రెండు పర్యాయాలు సేవలందించి, మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన గొప్ప సేవా మూర్తి అని కొనియాడారు. నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనని నీ జ్ఞాపకాలతోనే ఇక నా మిగిలిన ప్రయాణం అని మీ కోరిక మేరకు ఇక నా జీవితం ప్రజా సేవకే అంకితం అని రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మన సంప్రదాయం ప్రకారం పెద్దలకు బియ్యం ఇవ్వడం, దేవాలయంలో గంట కట్టే కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. పెద్దల దీవెనలు ఆమె ఆత్మకు శాంతిని చేకూరుస్తాయని తెలిపారు. అనంతరం, విచ్చేసిన వారందరూ భోజనం స్వీకరించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసి, తమ ఆత్మీయురాలికి నివాళులు అర్పించి, తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.