తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నల్లగండ్ల లోని వర్టెక్స్ కింగ్ స్టన్ పార్క్ విల్లాస్ క్లబ్ హౌస్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్ పర్సన్ కీ.శే. రాగం సుజాత యాదవ్ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన పెద్దలకు బియ్యం ఇవ్వడం మరియు దేవాలయంలో గంట కట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి పాపిరెడ్డి కాలనీలోని సీనియర్ మహిళా సంఘ సేవకురాలైన కే. కనకలక్ష్మి విచ్చేసి కీ.శే. రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగ కే. కనకలక్ష్మి మాట్లాడుతూ, ప్రజా సేవలో తోడుగా నిలిచిన రాగం సుజాత యాదవ్ ఇక లేకపోవడం తీరని లోటని , వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
