తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ జీఎస్ఎమ్ మాల్ లోని మధుర బాంకెట్ హాల్ లో శేరిలింగంపల్లి మండలం ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు మరియు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకుల సమక్షంలో 600మంది సభ్యుల సమక్షంలో ఘనంగా కన్నుల పండుగగా నిర్వహించారు. శేరిలింగంపల్లి మండలం ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షులుగా మాశెట్టి ప్రభాకర్ , ప్రధాన కార్యదర్శిగా పోలా కోటేశ్వరరావు, కోశాధికారిగా బాదం సర్వ లింగం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ , రేణిగుంట్ల గణేష్ కోశాధికారి, అర్థం లక్ష్మయ్య , ఉపాధ్యక్షులు, పలమట్ల ఆనంద్ బాబు ఉప్పల్ బాగాయత్ , భవన నిర్మాణ కమిటీ చైర్మన్ , రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గందే సురేష్ , బిల్లకంటి కిరణ్ గుప్తా, ప్రధాన కార్యదర్శి, వనపర్తి బద్రీనాథ్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు సామ్రాజ్యలక్ష్మి , కోశాధికారి పలబట్ల శ్రీదేవి సమక్షంలో నూతన అధ్యక్షులుగా మాశెట్టి ప్రభాకర్ , ప్రధాన కార్యదర్శిగా పోలా కోటేశ్వరరావు, కోశాధికారిగా బాదం సర్వ లింగం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, బస్తీ సంఘాల ఎన్నిక చేసిన నాయకులు, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శి , ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేసారు. శేరిలింగంపల్లి మండల మహిళా సంఘం తరఫున అధ్యక్షురాలు శ్రీమతి శ్రీవారి రేఖ గుప్తా , ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఉప్పుగండ్ల లావణ్య గుప్తా , కోశాధికారి శ్రీమతి బాదం లక్ష్మి గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు ఏడు బస్తీల సంఘాలలో ఎన్నికచేసిన వివిధ నాయకులు, మహిళా మణులు, ఉపాధ్యక్షులుగా సంయుక్త కార్యదర్శిగా ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎన్నికచేసి వారిచే ప్రమాణస్వీకారం చేయించారు. ఇదే కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి మండలం ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం అధ్యక్షులు నాయకులు అన్నవరం హరి గుప్తా, ప్రధాన కార్యదర్శి కొత్తూరి మధుసూదన్ గుప్తా, కోశాధికారి చిన్నం సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఏడు బస్తీ సంఘాల నుండి నాయకులను ఎంచుకొని సంయుక్త కార్యదర్శి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గా ఎన్నికచేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధుమిత్రులు , అన్ని బస్తీ సంఘాల నాయకులు కొక్కళ్ల బాలరాజు, ఉప్పుగండ్ల ఆనంద్, ఎం ఎన్ బాబు , ముక్క పృథ్వీ గుప్తా , నూకల సందీప్ , బాదం భాస్కర్ లతో కలిసి చేదోడు వాదోడుగా నిలిచి ప్రమాణ స్వీకారం కార్యక్రమం దిగ్విజయం చేయడానికి ముఖ్యపాత్ర పోషించిన గోలి రాజు శేరిలింగంపల్లి ఫౌండర్ ప్రెసిడెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మాశెట్టి ప్రభాకర్ గుప్తా , పోలా కోటేశ్వరరావు, బాదం శర్వలింగం , మహిళా సంఘం నాయకులు, యువజన సంఘం నాయకులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.