తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: నాంపల్లిలోని చేనేత భవన్ మొదటి అంతస్తులో తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకట రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు చేనేత రంగ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యదర్శి, టీపీసీసీ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్, తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మంత్రి కమలాకర్ నేత, టీపీసీసీ కరీంనగర్ చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు బండారి సదానందం పాల్గొన్నారు. నూతన కార్యాలయ ప్రారంభం సందర్భంగా చేనేత కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకట రమణను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, చేనేత కార్పొరేషన్ వైస్ చైర్మన్ జక్కని అనితలను కూడా శాలువాలతో సత్కరించారు.

చేనేత రంగ అభివృద్ధి, నేతన్నల సంక్షేమం, చేనేత కార్మికులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా సంబంధిత సంస్థల కార్యాచరణ మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

Avatar photo

By Murthy