• పద్మశాలి ప్రముఖులకు, ఇంజనీరింగ్ విభాగం నాయకులకు చిత్రపటాలు, క్లాత్ బ్యాగుల పంపిణీ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: అఖిల భారత పద్మశాలి సంఘం పద్మశాలి భవన్, రాజ్ మొహల్లాలో సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారిని, పద్మశాలి ప్రముఖులను, ఇంజనీరింగ్ విభాగం నాయకులను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ డా. పెండెం కృష్ణ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పద్మశాలి ఆరాధ్య దైవం శ్రీ మార్కండేయ స్వామి, భావన ఋషి, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాలను అందజేశారు.
అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పునర్వినియోగానికి అనుకూలమైన క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు. పద్మశాలి ఇంజనీరింగ్ విభాగం నాయకులకు భారతీయ ఇంజనీరింగ్ రంగానికి విశేష సేవలందించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య, శ్రీ మార్కండేయ స్వామి, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాలతో పాటు గోడ గడియారాలు, క్లాత్ బ్యాగులను అందజేశారు.
ఈ సందర్భంగా డా. పెండెం కృష్ణ కుమార్ మాట్లాడుతూ, పద్మశాలి సమాజం ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. సంప్రదాయాలు, సంస్కృతి, సామాజిక సేవతో పాటు పర్యావరణ హితమైన అలవాట్లను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, పద్మశాలి ప్రముఖులు, ఇంజనీరింగ్ విభాగం నాయకులు పాల్గొన్నారు.
