రూ.50 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్:

జమ్మికుంట పట్టణ పరిధిలోని ఆబాది జమ్మికుంట 13, 14వ వార్డుల్లో పోచమ్మ తల్లి దేవాలయానికి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ భూమిపూజ చేశారు. సుమారు రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ.. తమ పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. 13, 14వ వార్డుల కౌన్సిలర్లు ఎగిత సుజాత అశోక్, మైస శిరీష రవి పోచమ్మ తల్లి దేవాలయానికి వెళ్లే రోడ్డు నిర్మించాలని కోరడంతో, వారి విజ్ఞప్తి మేరకు నేడు భూమిపూజ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

తమ పాలకవర్గం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలతో మమేకమై పట్టణ అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎగిత సుజాత అశోక్, మైస శిరీష రవి, దయ్యాల శ్రీనివాస్, జక్కే రవీందర్, పొడేటి అనిల్, దొడ్డె శ్రీకాంత్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.