తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: సుదర్శన్ నగర్ కాలనీలో ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్టు పూర్తిగా ఎండిపోవడంతో ఏ క్షణాన్నైనా పడిపోయే స్థితిలో ఉన్న కారణంగా రహదారిపై ప్రయాణించే వాహనదారులు, పాలచారులు, వృద్ధులు గత కొంతకాలంగా భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో సమాచారం అందుకున్న యుబీడీ వింగ్ అధికారులు వెంటనే స్పందించి ప్రమాదంగా మారిన చెట్టుని తొలిగించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, రహదారి పక్కనున్న చెట్టు ఎండిపోయి ప్రమాదభరితంగా ఉన్న చెట్టును తొలగించి సమస్యను పరిష్కరించినందుకు యుబీడీ వింగ్ అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.