తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకటి రాజకుమార్, వారి కార్యవర్గ సభ్యులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ దూడెం వెంకటరమణకు శుభాకాంక్షలు తెలియజేసి, నూతన కార్యాలయం ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకటి రాజకుమార్తో పాటు గౌరవ అధ్యక్షులు వేముల బాలరాజు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎలిగేటి దేవేందర్, రాజకీయ కన్వీనర్ గుంటి నాగేష్, కార్యాలయ కార్యదర్శి గంజి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ధనుంజయ్, రాష్ట్ర కార్యదర్శి బొమ్మిడాల లక్ష్మణ్, GHMC ఉపాధ్యక్షులు రచ్చ వెంకటేష్తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి సంబంధిత సంస్థలు మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.
