తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకులు, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించి ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
