తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : మియాపూర్‌లోని శ్రీరంగాపురం కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ కేశవ్ రావు ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కేశవ్ రావు ఆహ్వానం మేరకు యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పూజాకార్యక్రమంలో పాల్గొని జగన్మాత శ్రీ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, అమ్మవారికి హారతి సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న కేశవ్ రావును అభినందించారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జగన్మాత శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి సమృద్ధిగా వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు యలమంచి ఉదయ్ కిరణ్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మూర్తి, రెడ్డి, ప్రసాద్, నరసింహ, చరణ్, శరత్, వంశీ, రత్నాచారి, సతీష్, శశి, ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీపెద్దలు, మహిళలు, స్థానికులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతం చేసారు.