తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, గౌరవ పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ పుట్టినరోజు శుభ సందర్బంగ బేరి రామ్ చందర్ యాదవ్ బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందేలా కుమార్ యాదవ్, సిరిపురం హరికృష్ణ చారి బీసీ కులాల ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ, పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు శ్రేయోభిలాషులు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేకి మున్ముందు ఉన్నత పదవులు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకున్నారు.
