తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పిఎసి చైర్మన్ అరేకపూడి గాంధీ జన్మదిన శుభసందర్భంగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ఎమ్మెల్యే గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం మహంకాళి నగర్ లోని ఆశా నగర్ లో ఉన్న వెంకటేష్ గౌడ్ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, పాస్టర్లు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
