తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి: ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని కలిగి, చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజాసేవలో ముందుండే ప్రజానాయకుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ జన్మదినం సందర్భంగా మిరియాల ప్రీతమ్, మిరియాల రాఘవరావు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు గాంధీ నివాసానికి వెళ్లి, గజమాలతో ఘనంగా సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మరింత సేవలందిస్తూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చిరకాలం ప్రజాజీవితంలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విష్ణుమూర్తి, జగన్నాథరావు, చలం, కృష్ణ, త్రినాథ్, ప్రసాద్, పరదేశి నాయుడు, శ్యామల రావు, వెంకట్రావు, విష్ణు, సాయి, త్రిలోచన్ తదితరులు పాల్గొన్నారు.
