తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే నివాసం వద్ద గుల్మహార్ పార్క్ కాలనీ అధ్యక్షులు ఖాసీం సార్ వారి సభ్యులతో ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఖాసీం సార్ మాట్లాడుతూ, ఆ భగవంతుని ఆశీస్సులతో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.