• 35 డివిజన్ శివనగర్ లో సీల్డ్ పనులు వెంటనే జరిపించాలి.. కాలువలో గులాబీ పూలు జల్లుతు వినూత్న నిరసన

• స్థానిక ఇండిపెండెంట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ క్యాండిడేట్ మేరుగు అశోక్

న్యూస్ డెస్క్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని శివనగర్ 35వ డివిజన్‌లో నాలాల పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా మారిందని స్థానిక ఇండిపెండెంట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలపై నిరసనగా గులాబీ పూలతో వినూత్నంగా నిరసన చేపట్టారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న స్థానిక పాలకులకు ప్రజలు ఎన్నోసార్లు నాలాల సమస్యపై విన్నవించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. నాలాలు శుభ్రపరచకపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రస్తుతం వరంగల్ మహానగర పాలక సంస్థ పదవీకాలం ముగియడంతో బాధ్యతలను ఇంచార్జీగా కమిషనర్‌కు అప్పగించారని పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే నాలాల అభివృద్ధి పనులు చేపట్టకపోతే 35వ డివిజన్ పూర్తిగా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అందువల్ల అధికారులు తక్షణమే స్పందించి నాలాల శుభ్రపరిచే పనులు పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని మేరుగు అశోక్ డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో 35 డివిజన్ పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి, నాగుల బిక్షపతి, బజ్జూరీ అంజయ్య, వెంగల్దాస్ కృష్ణ, వుగ్గే రమేశ్, పాల సత్యం, కొత్తగట్టు శ్యామ్,జన్ను రాధ, చిదురాల సాయి, అంకతి అఖిల్, శ్రవణ్, సాయి విక్షిత్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు