తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా సోమ సందీప్ గుప్తా అధికారికంగా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన పత్రాన్ని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి మరియు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్వయంగా అందజేశారు. ​ఈ సందర్భంగా సోమ సందీప్ గుప్తా మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, స్థానిక నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని, యువతను పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.