తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాజేంద్రనగర్–అత్తాపూర్ సర్కిల్ ఇన్చార్జి కొలన్ సుభాష్ రెడ్డి పిలుపునిచ్చారు. కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్, మైలార్దేవ్పల్లి డివిజన్ అధ్యక్షుడు గుమ్మడి కుమార్ ఆధ్వర్యంలో బాబుల్ రెడ్డి నగర్లోని వెంకటేష్ కార్యాలయంలో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమానికి కొలన్ సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సుభాష్ రెడ్డి సూచించారు. ఎవరూ ఓటరు నమోదుకు సంబంధించిన అవకాశాన్ని కోల్పోకుండా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రతి కాలనీకి ప్రత్యేక నాయకులను నియమించి నమోదు ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.కాటేదాన్, మైలార్దేవ్పల్లి డివిజన్ల అధ్యక్షులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచే స్తున్నారని ఆయన అభినందించారు. ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు డి. రమేష్ ముదిరాజ్, జె. చిత్తారి, సీనియర్ నాయకులు జీవన్ దాస్, ఏ. సూర్యం, మైసిరెడ్డి, బండ రాజేష్ యాదవ్, చిత్తారి వాసు, లక్ష్మి, రాజ్ బాలరాజ్ యాదవ్, కొంపల్లి జగదీష్, చిరంజీవి, భాస్కర్, వెంకట్ రమణ, అనిల్, సరిత, మహేష్, మహేందర్ ముదిరాజ్, సునీల్, మోహన్, రామస్వామి, రాజ్ కుమార్, శేఖర్ ముదిరాజ్, శివారెడ్డి, శివ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, అశోక్, మల్లేష్, ఆర్. కుమార్, సంతు, సహద్రి నరేష్, శ్రీకాంత్ చారి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
