తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కర్వాన్ నియోజకవర్గ పరిధిలోని గుడిమల్కాపూర్ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసన మండలి ఓటరు నమోదు శిబిరాన్ని నిర్వహించారు. గుడిమల్కాపూర్ బీఆర్‌ఎస్ డివిజన్ నాయకుడు అంబటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరుగా నమోదు చేసుకోవాలని నాయకులు కోరారు.మోహిని ఫంక్షన్ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో దాదాపు 100కు పైగా పట్టభద్రుల ఓటరు నమోదు దరఖాస్తులను అంతర్జాలం ద్వారా నమోదు చేశారు. విద్యావంతులు ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకుని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో శివరాత్రి రాములు, సత్యనారాయణ గౌడ్, గున్నల రంగారెడ్డి, సత్యనారాయణ పటేల్, పల్లపు తిరుపతి, అల్లేపు అరవింద్ తదితర నాయకులు పాల్గొన్నారు.