పార్టీ బలోపేతం, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యం: బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి
ఇల్లందకుంట, అక్టోబర్ 25 తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్
భారతీయ జనతా పార్టీ ఇల్లందకుంట మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి నాయకత్వంలో పలు గ్రామాల్లో శక్తి కేంద్రాల వారీగా టిఫిన్ బైఠక్ కార్యక్రమాలు నిర్వహించారు. సిరిసేడు, కనగర్తి, బుజునూర్, రాచపల్లి, ఇల్లందకుంట, మల్యాల గ్రామాల్లో జరిగిన ఈ సమావేశాలకు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ సంస్థాగత బలోపేతం, గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం టిఫిన్ బైఠక్ల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి సమావేశాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో నిర్వహించనున్న యువకుల ర్యాలీని విజయవంతం చేసేందుకు ఇల్లందకుంట మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేసి ర్యాలీ విజయవంతానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమాల్లో మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డితో పాటు ఉప్పుల రమేష్, గుత్తికొండ రాంబాబు, ఇంగ్లే ప్రభాకర్, నల్ల లింగారెడ్డి, ఎండీ షఫీ, సామ కర్ణాకర్ రెడ్డి, చింతల ఐలయ్య, రామంచ సంపత్, ఆసాల సుధాకర్, ఉప్పు దుర్గయ్య, గుడికందుల పావని, సోమిడీ సురేందర్, మట్ట పవన్ రెడ్డి, గుత్తికొండ పవన్, జిల్లెల్ల శ్రీపాల్ రెడ్డి, ఇంగ్లే రమేష్, తిప్పరబోయిన సమ్మయ్య, ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, జోడు సంపత్, గురుకుంట్ల సంజీవ్, వడ్లకొండ జలపతి, పలకల కిషన్ రెడ్డి, చీపతి శ్రీకాంత్, రవీందర్, స్వామి దాస్, రావుల అశోక్, దేవునూరి లచ్చన్న తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
