తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :కాటేదాన్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా డి. వేణు ముదిరాజ్ నూతనంగా ఎంపిక య్యారు.ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్‌,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర రెడ్డి, రాజేంద్రనగర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జె. మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా డి. వేణు ముదిరాజ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కాటేదాన్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. యువత సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, యువతను ఏకం చేస్తూ యూత్ కాంగ్రెస్‌ను కాటేదాన్ డివిజన్‌లో మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, యువతకు అండగా నిలుస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.