• ఎస్టీ రిజర్వేషన్లకు 50 సంవత్సరాలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ జూన్ 26 : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కేంద్రంలో ఘనంగా ‘ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర’ ఎస్టీలకు లంబాడీ, ఎరుకల, యానాది తదితర గిరిజన వర్గాలకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రిజర్వేషన్లు కల్పించి 50సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర’ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కేంద్రం చేరుకుంది. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ , ఎంపీ బలరాం నాయక్ , ఎమ్మెల్యే బాలు నాయక్ , ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ తో పాటు గిరిజన నాయకులు పాల్గొన్నారు . ఈ మావేశంలో నాయకులు మాట్లాడుతూ, గిరిజన వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ కల్పించిన ఎస్టీ రిజర్వేషన్లు గిరిజనుల అభ్యున్నతికి బాటలు వేసాయని, ఆ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, మునిసిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సర్పంచ్ లు , వివిధ మండల నాయకులు , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు , పట్టణ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.
