రంగారెడ్ది: తెలంగాణ ఎక్స్ ప్రెస్ : చందానగర్  డివిజన్ పరిదిలోని న్యూ శంకర్ నగర్ కాలనీలో నిర్మించనున్న మండపం, కమిటీ హాల్ పూజ కార్యక్రమానికి హాజరై అభివృద్ధి పనులకోసం కాంగ్రెస్ నాయకులు మిరియాల ప్రీతమ్ రూ.1లక్ష విరాళాన్ని ప్రకటించారు. కాలనీ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ పాల్గొని మిరియాల ప్రీతమ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు హాజరై కాలనీ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కాలనీ అభివృద్ధి కోసం మిరియాల ప్రీతమ్ ప్రకటించిన విరాళం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సేవలో ముందుండే నాయకుడిగా మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారని కాలనీ వాసులు పేర్కొన్నారు