తెలంగాణ ఎక్స్ ప్రెస్ జూన్ 26 : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్లో సర్వేలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పొదిల రామయ్య ,పార్టీ బృందం సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ యొక్క దినావస్థితి విద్యార్థులు పడుతున్న బాధలు కళ్ళకు కట్టినట్టు కనిపించాయని పొదిల రామయ్య అన్నారు. ఈ సందర్భంగా పొదిల రామయ్య మాట్లాడుతు, స్వాతంత్రం వచ్చి 78సంవత్సరాలు గడిచిపోతున్న పాలకుల అసమర్ధ విధానాల ఫలితంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ సమస్యలకు నిలయాలుగా మారాయని, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్ పరిస్థితి పరిశీలిస్తే పాలకుల పరిపాలన ఏవిధంగా ఉందో అర్థం అవుతుందని , మురికి కూపాలుగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడిచిపోతున్న ఇప్పటివరకు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ ఇవ్వకపోవడం విడ్డూరమని, ప్రభుత్వ మాత్రం సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నామని వేదికల మీద గొప్ప గొప్ప మాటలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో పరిస్థితి దయనీయంగా ఉందని, నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ హాస్టల్ ను ఒక్కసారి పరిశీలిస్తే దాని యొక్క దీనావస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని, ఊడిపోయిన తలుపులు, దుర్గంధం వెదజల్లుతున్న మరుగుదొడ్లు, అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు వీటన్నింటికీ తోడు విరిగిపోయిన తలుపులు వంగిపోయిన ఫ్యాన్లు పెచ్చులూడిన స్లాబ్ వేలాడుతున్న ఇనుప చువ్వలు, దోమల జాలిలేని కిటికీలు ఇన్ని సమస్యలకు నిలయంగా మారిన ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్ పట్ల సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్య వైఖరి, స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ సంబంధిత ఇంత మంది అధికారులు ఉన్నా కనీసం చదువుకోడానికి అనుకూలంగా లేని హాస్టల్లో విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా నిర్ణయిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సాంఘిక సంక్షేమ హాస్టల్లో బస చేయాలని అధికారులకు ఎమ్మెల్యేలకు చెప్పడం కేవలం పిక్నిక్ టూర్ లా మారిందని అధికారులు వచ్చినప్పుడు నానా హంగామా చేసి సున్నాలు వేసి క్లీనింగ్ చేసే మంచి భోజనం వడ్డించినంత మాత్రాన సాంఘిక సంక్షేమ హాస్టల్లో తీరు మారదని నిత్యం అధికారుల పర్యవేక్షణ ఎమ్మెల్యే చొరవ కలెక్టర్ యొక్క పర్యవేక్షణ ఉంటే తప్పించి సాంఘిక సంక్షేమ హాస్టల్లు బాగుపడవని అన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్ వేరే హాస్టల్లోకి మార్చాలని డిమాండ్ చేశారు. పై హాస్టల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటం నిర్వహిస్తామని సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు మధు, సురేష్ , సుభాష్, కురుమయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
