శేరిలింగంపల్లి నియోజకవర్గం,తెలంగాణ ఎక్స్ ప్రెస్: కొండాపూర్ కల్చరల్ క్లబ్‌లో వడ్డెర సంఘం సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిట్ల శ్రీధర్ హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన వడ్డెర సమాజ ఐక్యత, అభివృద్ధి, యువతకు విద్యా, ఉపాధి అవకాశాల కల్పన, సంఘ బలోపేతంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. సమాజ పురోగతికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు, పెద్దలు, యువత, పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పిట్ల శ్రీధర్ ను సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు.