శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలంగాణ ఎక్స్ ప్రెస్: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలోని పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీవాసులతో కలసి పాదయాత్రచేసిన మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్. ఈ సంధర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతు, మయూరినగర్ కాలనీలో కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీవాసులతో కలసి పాదయాత్ర చేయడం జరిగినదని, వర్షాకాలన్నీ దృష్టిలో ఉంచుకొని, మయూరి నగర్ కాలనీలో ఉన్నటువంటి నాళాల తోపాటు సమస్యలను స్వయంగా పర్యటించి పరిశీలంచడం జరిగినదని, అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం జరిగినదని, మయూరి నగర్ కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని, కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు,డ్రైనేజి, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని,పీఏసీ. ఛైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో, డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను విడతల వారిగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల కృషి చేస్తామని తాజా మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మయూరి నగర్ కాలనీ అధ్యక్షులు కె. రామరాజు, ఉపాధ్యక్షులు హరి క్రిష్ణ, జనరల్ సెక్రెటరీ కిషోర్, అసోసియేషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రమణ రెడ్డి, వేణు, విజయ్ మోహన్, ప్రేమానందం,శ్రీధర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.