తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బేతోలు గ్రామంలో మొహరం వేడుకల్లో భాగంగా ఉర్సు గుట్టపై పీరీల మట్టిలకు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు బేతోలు గ్రామంలో ఉర్సు గుట్ట పై ఉన్న మహబూబ్ సుభాని దర్గా వద్ద అలాగే పీరీల కొట్టంలో ఉన్న అగ్నిగుండం చుట్టూ భక్తులు బటికీలతో తిరుగుతూ ప్రార్థనలు ఫాతిహాలు నిర్వహించి అనంతరం పానకం పంపిణీ చేశారు మత పెద్ద షేక్ యూసుఫ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతీ ఒక్కరు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు బేతోలు గ్రామ శివారులోని ఉన్న భజన తండా మాన్సింగ్ తండా చంద్ర నగర్ కాలనీలలో పీరీలను ఊరేగి స్తుండగా భక్తులు రంగుల పట్టిలు కుడకలు బెల్లం ఊదు కానుకలు సమర్పించారు చివరి రోజు బేతోలు గ్రామంలో శనివారం మొహరం (షహదత్) నిర్వహిస్తారని ముస్లిం మత పెద్దలు తెలిపారు ఆయా వేడుకల్లో ముస్లిం మత పెద్దలు షేక్ మస్తాన్ షేక్ మైనోద్దీన్. షేక్ షేక్అలీ షేక్ మైబు షేక్ జబ్బర్ మియా బాల్ సైదు షేక్ ఫకీర్ షేక్ మదర్ షేక్ హైమద్ షేక్ యాకూబ్ మియా షేక్ జానీ మియా షేక్ లతీఫ్ షేక్ ఖాదర్ బాబా షేక్ జావిద్ షేక్ పాషా షేక్ ఖాజా షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
