తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్: మహబూబాబాద్ జిల్లా ప్రజా సమస్యల కోసం నిత్యం గళం విప్పే పాత్రికేయ సోదరుల అవసరాన్ని గుర్తించి మహబూబాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ కాలనీలో ఏర్పాటు చేసిన బోర్‌వెల్‌ను సోమవారం జర్నలిస్టుల ఆహ్వానం మేరకు 19వ వార్డు కౌన్సిలర్ చిదిరాల అరుణ – జ్ఞానేశ్వర్ కొబ్బరికాయ కొట్టి పసుపు–కుంకుమతో పూజలు నిర్వహించి జర్నలిస్టులతో కలిసి ప్రారంభించి నీటి సరఫరాను అందుబాటులోకి తీసుకువచ్చారు ఈ సందర్భంగా జర్నలిస్టులు కౌన్సిలర్ దంపతులకు ఘనంగా సన్మానం చేసి కృతజ్ఞతలను తెలియజేశారు అనంతరం జర్నలిస్టుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని వినతిపత్రాలను స్వీకరించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ళు అందేలా కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తామని కౌన్సిలర్ చిదిరాల అరుణ జ్ఞానేశ్వర్ హామీ ఇచ్చారు.