తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం : కొండాపూర్ డివిజన్ BRS నాయకులు మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ డివిజన్ లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగ అల్లావుద్దీన్ పటేల్ మాట్లాడుతు, సమాజ భవిష్యత్తు పిల్లల ఆరోగ్యంతోనే ముడిపడిందని పోలియో మహమ్మారిని పూర్తిగా అంతంచేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ఐదు సంవత్సరాలలో లోపు పిల్లలు ఎవరైనా ఉంటే వారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండని రెండు చుక్కలు బిడ్డకు రక్షణ అనే నినాదంతో మన దేశాన్ని పోలియో రహిత దేశంగా ఉంచుదామని అన్నారు.