తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి రవి రాథోడ్ మహబూబాబాద్ లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ముఖ్య అతిథిగా పాల్గొని 0-5 లోపు పిల్లలకు పోలియో చుక్కలు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాలలో పిల్లలందరికీ తప్పకుం డా పోలియో చుక్కలు వేయించాలన్నారు 29,30, మంగళవారం మూడు రోజులలో జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు గిరిజన తండాలలో వైద్య సిబ్బంది ఈ చుక్కల మందును అందిస్తారన్నారు. పిల్లల తల్లిదం డ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పిల్లలకి పోలి యో రాకుండా పోలియో చుక్కలు వేయించి ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించుటకు ప్రతి ఒక్కరూ ముందుండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర పల్స్ పోలియో పరిశీలకులు డాక్టర్ జాన్ బాబు పట్టణంలోని సాలార్ తండా పల్స్ పోలియో చుక్కల కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించి 100% పిల్లలకు పోలియో చుక్కలు అంద జేయాలని సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమం పూర్తి అయిన సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ మాట్లాడుతూ జిల్లాలో 469 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసి 76,660 మంది పిల్లల కు గాను73,570 వేసినట్లు అనగా 96% వేసినట్లుగా ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రావు మున్సిపల్ చైర్మన్ జ్యోతి వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శివకుమార్ డిప్యూటీ డెమో రాజ్ కుమార్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ స్వామి పురుషోత్తం శ్రీనివాస్ పాల్గొన్నారు.
