తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేతను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ బుధవారం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రభుత్వ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు తదితర అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు. జిల్లా యంత్రాంగం తరఫున పోలీసు శాఖతో సంపూర్ణ సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తామని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. ప్రజా భద్రతను మరింత పటిష్ఠం చేయడంతో పాటు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం-పోలీసు శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ ఉమ్మడిగా పనిచేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.