తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేతారెడ్డిని ఎన్‌పీడీసీఎల్ (ఎన్ పి డీ సీ ఎల్) సీఎండీ వరుణ్ రెడ్డి బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిపికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వరంగల్ నగరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, ప్రజా భద్రత పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో పోలీసు శాఖ-విద్యుత్ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు అధికారులు సంక్షిప్తంగా చర్చించారు. ప్రజలకు అంతరాయం లేని విద్యుత్ సరఫరాతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే విధంగా పోలీసు, విద్యుత్ శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా చర్చించారు.

Avatar photo

By Murthy