తెలంగాణ ఎక్స్ ప్రెస్, కూకట్‌పల్లి నియోజకవర్గం: తెలంగాణ కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ మొయిజ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శాలువాతో ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా మొయిజ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండి, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని బండి రమేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్సీ చైర్మన్ పుష్పా రెడ్డి , కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మయ్య , కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని ఎండీ మొయిజ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
