తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి జిల్లా కలెక్టర్ అనుమతితో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్ అదనపు ముఖ్య అతిధిగా పాల్గొని దొడ్డి కొమరయ్య గారి చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ధొడ్డి కొమురయ్య చేసిన త్యాగాలు చిరస్మరణీయమని ఆయన స్పూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్య క్రమములో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి సి హెచ్ సాయిశ్రీజ జిల్లా అధికారులు వసతి గృహ సంక్షేమ అధికారులు IDOC కార్యాలయ సిబ్బంది మరియు జిల్లాలోని గొల్ల కురుమ వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
