• పద్మశాలి సమాజ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యం

హైదరాబాద్: పద్మశాలి సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రతిభావంతులను గుర్తించి సత్కరించేందుకు నేతన్న టీవీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “నేతన్న టీవీ అవార్డ్స్ – 2026” పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం PHT షాపింగ్ మాల్ మేనేజింగ్ పార్ట్నర్స్ గుజ్జ సత్యం, గడ్డం వెంకటేశం, తిరందాస్ ధనంజయ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పోస్టర్‌ను ఆవిష్కరించి, అవార్డ్స్ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

పోస్టర్ ఆవిష్కరిస్తున్న PHT షాపింగ్ మాల్ మేనేజింగ్ పార్ట్నర్స్

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, నేతన్న టీవీ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశాలి సమాజానికి చెందిన వివిధ రంగాల ప్రతిభావంతులను ఒకే వేదికపై సత్కరించాలనే లక్ష్యంతో “నేతన్న టీవీ అవార్డ్స్- 2026” నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజానికి విశిష్ట సేవలందించిన వ్యక్తులను ప్రోత్సహించడం, వారి సేవలను గుర్తించి గౌరవించడం ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమన్నారు.

సేవ, సామాజిక సేవ, విద్య, వ్యాపారం, చేనేత & వస్త్ర పరిశ్రమ, వ్యవసాయం, కళలు & సంస్కృతి, సాహిత్యం, సాంకేతికత, వైద్య రంగం, క్రీడలు, ప్రజా సేవ, యువ ప్రతిభ, జీవిత సాఫల్య పురస్కారం తదితర విభాగాల్లో విశేష కృషి చేసిన వారు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

దరఖాస్తుతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సాధించిన విజయాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, అవసరమైన ఆధార పత్రాలు, మీడియా కటింగ్స్ లేదా ఇతర సంబంధిత పత్రాలను జతచేయాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన పత్రాలతో కలిసి WhatsApp నంబర్: 9441623078కు పంపించాలని నిర్వాహకులు కోరారు.

“మన కోసం.. మన టీవీ.. మీ నేతన్న టీవీ” అనే నినాదంతో పద్మశాలి సమాజ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నేతన్న టీవీ ప్రతినిధులు పేర్కొన్నారు. అర్హులైన ప్రతిభావంతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంప్రదించవలసిన నంబర్: 9441623078.

Avatar photo

By Murthy