ఆశా డే సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా గురువారం డోర్నకల్ నియోజకవర్గం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రాంచద్రునాయక్ డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి ఆరోగ్య సేవలు ప్రజలందరికీ అందేటట్లు మందులు నిల్వ చేసుకోవాల్సిందిగా వైద్యాధికారికి సూచించి ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు సాధించాలని తెలియజేస్తూ ఆశా డే కార్యక్రమంలో పాల్గొన్నారు ఆశా డే సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలలో భాగంగా మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు ప్రబలకుండా దోమలు పుట్టకుండా నీరు నిల్వ ఉండకుండా మరియు దోమలు కుట్టకుండా ఇంటింటి సర్వే ల నిర్వహిం చి లార్వాలో తొలగించాలని మరియు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని పరిసరాల పరిశుభ్రత జాగ్రత్తలపై గ్రామాల లోని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని హెచ్ పి వి వ్యాక్సిన్ – గర్భాశయ క్యాన్సర్ నివారణలో భాగంగా 14 సంవత్సరాల నిండిన 15 సంవత్సరాల లోపల బాలికల కు హెచ్ పి వి వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పించాలని జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు హైస్కూల్లో ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను 13.7.2026 సోమవారం రోజు జాతీయ నులి పురుగుల దినోత్సవ సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలు మింగడం వలన మానసిక పెరుగుదల మరియు నులి పురుగులను నివారించవచ్చని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సాధారణ ప్రసవాలు జరుగునట్లు ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ప్రాథమిక కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ సాత్విజ మరియు ఆశలకు సూచించారు ఇట్టి తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
