తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: మియాపూర్ పరిధిలోని పలు ప్రాంతాలు, మక్తా డివిజన్‌లోని ప్రజా షెల్టర్స్, బీకే ఎంక్లేవ్‌తో పాటు ఇతర నివాస ప్రాంతాలను భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ స్థానిక నాయకులు, నివాసితులతో కలిసి సందర్శించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఓటరు నమోదు వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకొని తమపేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదై ఉందో లేదో నిర్ధారించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా భాగస్వామి కావాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా, ఎన్యూమరేషన్ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో కూడా సులభంగా సమర్పించవచ్చని వివరించి, ఫారమ్‌ను ఎలా పూరించాలో మియాపూర్ ప్రజలకు దశలవారీగా స్వయంగా అవగాహన కల్పించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకునేలా మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రావిపాటి వెంకటేశ్వర్లు, రెడ్డమ్మ, గోపాలకృష్ణ, శ్రీనివాస్, ధనుంజయ, ఎంసీ రెడ్డి ,రామకృష్ణ, శ్రీను, నవీన్, వంశీ, ప్రవీణ్, రామ్, శశితో పాటు పలువురు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువకులు, కాలనీ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు ప్రతి చెల్లుబాటు అయ్యే ఓటు మరింత బలోపేతమైన ప్రజాస్వామ్యం కోసం అన్నారు.
