సూర్యాపేట జిల్లా: మద్దిరాల మండలంలోని గుమ్మడవెల్లి గ్రామ చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మొత్తం తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఈ పాలకవర్గంలో అధ్యక్షుడిగా గుడ్ల వెంకన్న, ఉపాధ్యక్షుడిగా అనబత్తుల శ్రీను, కార్యదర్శిగా అడ్డగట్ల వెంకటేశ్వర్లు, కోశాధికారిగా కోట సోమయ్య ఎన్నికయ్యారు. సభ్యులుగా వేముల వెంకన్న, రాపోలు సోమయ్య, చిలుకమారి నర్మద, చెల్లమల్ల కాంతమ్మ, అనబత్తుల నాగేశ్వర్లు ఏకగ్రీవంగా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గుడ్ల వెంకన్న మాట్లాడుతూ, చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి జీవనోపాధి మెరుగుపడేందుకు, చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడానికి అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు. చేనేత కార్మికుల హక్కుల పరిరక్షణ, సహకార సంఘాల బలోపేతం, సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిరంతరం శ్రమిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన, సహకార సంఘాల అభివృద్ధి కోసం నూతన పాలకవర్గం సమష్టిగా పనిచేయాలని గ్రామస్తులు, చేనేత కార్మికులు ఆకాంక్షించారు. గుమ్మడవెల్లి గ్రామ పద్మశాలి నేతన్నలు నూతన కమిటీ సేవలు చేనేత కుటుంబాల్లో కొత్త ఆశలు నింపాలని మనస్ఫూర్తిగా అభిలషించారు.

ఈ సందర్భంగా రచయిత కోట దామోదర్ నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ గుడ్ల వెంకన్న గారికి, అలాగే పాలకవర్గంలోని సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారి పదవీకాలం చేనేత కార్మికుల సంక్షేమానికి, సంఘ అభివృద్ధికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

Avatar photo

By Murthy